ఒక్కరోజే 70 విమానాలకు బెదిరింపు కాల్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

దేశీయ సంస్థల విమానాలకు(Aircraft of domestic companies) వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

Update: 2024-10-24 14:16 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ సంస్థల విమానాలకు(Aircraft of domestic companies) వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు(Fake threats) రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇవాళ (గురువారం) ఒక్కరోజే 70కి పైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. ఈ ఘటన పై తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Aviation Minister Rammohan Naidu) స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. విమానాల బెదిరింపులకు పాల్పడేవారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలు సవరిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

విమానయాన భద్రత(Aviation safety) తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు. గత పది రోజులుగా చాలా బెదిరింపు కాల్స్(Threatening calls) వచ్చాయని, కానీ అవన్నీ వట్టివేనని తేలిందని మంత్రి స్పష్టం చేశారు. విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడే వారికి వేసే శిక్షల పై చట్టంలో సెక్షన్లు ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా ఇవి వర్తించేలా మార్పులు చేసే విధంగా చేస్తున్నట్లు చెప్పారు. గతవారం పలు విమానాలకు బెదిరింపులు రావడంతో వేరే మార్గాలకు మళ్లించినట్లు చెప్పారు. ప్రతి దానిని ప్రత్యేకంగా విశ్లేషించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పుడు బెదిరింపులు అయినప్పటికీ ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News