సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..13 మంది భారతీయుల గల్లంతు

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. అందులో 13 మంది భారతీయులు ఉండగా..మరో ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారు.

Update: 2024-07-16 19:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. అందులో 13 మంది భారతీయులు ఉండగా..మరో ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారు. ఒమన్ మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌ (ఎంఎస్‌సీ) తెలిపిన వివరాల ప్రకారం..16 మంది సిబ్బందితో కొమొరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో రాస్ ఓడరేవు నగరమైన డుక్మ్ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం గల్లంతైనట్టు వెల్లడించింది. వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే నౌక తలకిందులుగా ఉండిపోయిందని తెలుస్తోంది. ట్యాంకర్ లో ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అవుతుందా అనే విషయం ధ్రువీకరించలేదు. కాగా, ఈ నౌక 2007లో నిర్మించిన 117-మీటర్ల పొడవు గల చమురు ఉత్పత్తుల ట్యాంకర్. ఈ చిన్న ట్యాంకర్లను సాధారణంగా చిన్న తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు.

Similar News