భారత హాకీ జట్టును ఘనంగా సత్కరించిన.. ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ
ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో.. కాంస్య పతకాన్ని సాధించిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యులను, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఘనంగా సత్కరించారు.
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో.. కాంస్య పతకాన్ని సాధించిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యులను, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఘనంగా సత్కరించారు. అయితే భారత పురుషుల హాకీ జట్టు బృందం నేడు ఒడిషాకు చేరుకున్నారు. వారికి అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. తదనంతరం హాకీ జట్టు సభ్యులు సీఎం మోహన్ చరణ్ మాఝీ ని స్వయంగా కలిశారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో ఒడిషా సీఎం మాఝీ.. ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన జట్టు సభ్యులందరిని ఘనంగా సత్కరించటంతో పాటు వారికి నగదు పురస్కారాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒడిషా డిప్యూటీ సీఎం కనక్ వర్ధన్ సింగ్ దేవ్ కూడా హాజరయ్యారు.