ఎస్‌సీఓ సమావేశానికి మోడీకి బదులుగా జైశంకర్..!

కజకిస్థాన్ లో జరిగే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో, ఆ భేటీకి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోది.

Update: 2024-06-29 04:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కజకిస్థాన్ లో జరిగే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో, ఆ భేటీకి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. షాంఘై సమ్మిట్ లో భారత ప్రతినిధిబృందానికి జైశంకర్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. అఫ్గాన్ పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం, ఎస్ సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచండంపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. ప్రస్తుతం కజకిస్తాన్ అధ్యక్ష హోదాలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.

ప్రధాని మోడీ రష్యా పర్యటన

దాదాపు ఐదేళ్ల తర్వాత జూలై 8న మోడీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా తర్వాత రెండ్రోజుల పర్యటన కోసం ఆస్ట్రియా వెళ్లే ఛాన్స్ ఉంది. రష్యా, ఆస్ట్రియా పర్యటనల దృష్ట్యా ప్రధాని మోడీ షాంఘై సదస్సుకు గైర్హాజరు కానున్నట్లు సమాచారం. ఇకపోతే, మోడీ రెండు దేశాల పర్యటనలపై ఇంకా ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు

Similar News