సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్‌సీ

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసింది.

Update: 2024-07-01 14:44 GMT

దిశ, వెబ్ డెస్క్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను upsc.gov.in వెబ్ సైట్‌లో చూసుకొవచ్చని తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి పరీక్ష ఈజీగా వచ్చిందని అభ్యర్థులే తెలుపుతుండంతో కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ కు ఎంపికవుతారు. 2024 యూపీఎస్‌సీ క్యాలెండర్‌ ప్రకారం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరిక్ష సెపెంబర్ 20 జరగనుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వివిధ విభాగాల్లో మొత్తం 1056 పోస్టులు ఖాళీగా ఉండగా ఈ మెయిన్ పరీక్షల అనంతరం అర్హత సాధించిన వారితో ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS),ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) శాఖలో ఖాళీలు ఉన్నాయి.

Similar News