ప్రధాని పదవిచ్చిన బీజేపీలో చేరను: కర్ణాటక మాజీ సీఎం
బీజేపీలో చేరడంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: బీజేపీలో చేరడంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని లేదా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఇచ్చిన కూడా తాను కాషాయ పార్టీలో చేరనని అన్నారు. అంతేకాకుండా తాను చనిపోతే తన మృతదేహం కూడా బీజేపీలోకి వెళ్లదని అన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సిద్ధరామయ్య, హెచ్డి కుమారస్వామి జనతాదళ్ సెక్యులర్పై విరుచుకుపడ్డారు.
జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చారని అన్నారు. అయితే సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేత నారయణ స్వామి కౌంటర్ ఇచ్చారు. సిద్ధ రామయ్య భ్రమలో మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర మాజీ సీఎంగా ఆయన పట్ల గౌరవం ఉందని, దానిని కాపాడుకోవాలని సిద్ధరామయ్యకు హితవు పలికారు. ఈ ఏడాది ప్రథమార్థంలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి.