UPSC CGSE Results: యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఫైనల్ ఫలితాలు విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ‘కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024(CGSE-2024)’ ఫైనల్ ఫలితాలను తాజాగా ప్రకటించింది.

Update: 2024-12-24 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ‘కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024(CGSE-2024)’ ఫైనల్ ఫలితాలను తాజాగా ప్రకటించింది. మొత్తం 69 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో పేరు(Name), రూల్ నంబర్ల(Roll No)తో సహా పొందుపరిచారు. అయితే నోటిఫికేషన్‌ కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలను ఫిబ్రవరిలో, మెయిన్స్ పరీక్షలను జూన్ లో నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా(GSOI), సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డు(CGWB)లో కేటగిరీ-1, కేటగిరీ-2 లో జియోలజిస్ట్, కెమిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (Preliminary) పరీక్ష (Objective Type), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (Mains) ఎగ్జామినేషన్ (Descriptive type), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్(Personality Test)/ ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News