New Fear Unlocked: నేను బ్రతకాలండి బాబు..! అందుకే భార్యకు ఆమె లవర్‌తో పెళ్లి చేశా..!!
భార్య ఎఫైర్‌ను తప్పుపట్టి బ్రతికి బట్టకట్టాలి కదా. మీరట్‌లో జరిగిన ఘటన చూసినం. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నా భార్యకు, ఆమె లవర్‌తో పెళ్లి చేశాను. నా పిల్లలను ఒంటరిగానే పెంచుతానని మాటిచ్చాను. ఉత్తరప్రదేశ్‌లో భార్య పెళ్లి చేసిన ఓ భర్త చెబుతున్న మాటలు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘లవర్‌తో కలిసి భర్త(Wife Marriage)ను చంపేస్తున్న ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. నాకు కూడా అలా జరుగుతుందేమోనని భయపడ్డా. నా భార్య పరాయి పురుషుడితో శారీరక(Wife Affair) సంబంధం పెట్టుకున్నదని తెలిశాక అడ్డుకుని గొడవపడి నా ప్రాణాల మీదికి తెచ్చుకోవాలని అనుకోలేదు. వారిద్దరికి పెళ్లి చేసి వారితోపాటు నేను కూడా ప్రాణాలతో ఉండాలని అనుకున్నాను. అందుకే ఊరిపెద్దల సమక్షంలో పెళ్లి జరిపించాను. మా ఇద్దరి పిల్లలనూ నేనే పెంచుతానని మాటిచ్చాను’.. తన భార్యకు ఆమె లవర్‌తో పెళ్లి చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్(UttarPradesh)కు చెందిన బబ్లూ(Bablu) చెప్పిన మాటలివి. అదే యూపీలో మొన్నమొన్నే జరిగిన రెండు ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనల నేపథ్యంలోనే భయంతో భార్య పెళ్లి చేయాలని డిసైడ్ అయినట్టు ఆయన చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో న్యూ ఫియర్ అన్‌లాక్డ్ అని కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి చేసుకోకుండా బ్రతికిపోయానని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
బబ్లూ మ్యారేజీ స్టోరీ ఏమిటీ?
ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామానికి చెందిన బబ్లూ.. గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను 2017లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లల సంతానం. బబ్లూ వేరే రాష్ట్రంలో వలసకార్మికుడిగా వెళ్లి పని చేస్తున్నాడు. బబ్లూ ఇలా వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన నేపథ్యంలో ఆయన భార్య తప్పుదారి పట్టింది. బబ్లూ గ్రామానికి చెందిన యువకుడు వికాస్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. ఈ వ్యవహారం ఏడాదిన్నరగా సాగుతున్నది. ఈ విషయం తెలిసిన తర్వాత బబ్లూ తన భార్యను ట్రాక్ చేసి ఆ ఎఫైర్‌ను కన్ఫామ్ చేసుకున్నాడు. ఆయన అనుమానాలు నిజాలని తెలిశాక భార్యపై ఒక దెబ్బా వేయలేదు.. కనీసం మందలించలేదు కూడా. ఆ ఊరి పెద్దలకు విషయం చెప్పి భార్య పెళ్లి చేసేశాడు.
ఊరిలోని శివాలయంలో భార్య రాధిక, వికాస్‌కు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాడు. కోర్టులో నోటిఫై చేశాడు. అఫిడవిట్‌లో తానే సాక్షిగా సంతకం పెట్టాడు. ఇద్దరు పిల్లలనూ తానే ఒంటరిగా పెంచుతాననీ భార్యకు మాటిచ్చి మరీ పెళ్లి చేశాడు. పెద్దల సమక్షంలో పెళ్లి జరిపి.. వారితో ఫొటో కూడా దిగాడు. రాధిక, వికాస్‌లు దండలు మార్చుకుంటున్న, రాధిక నుదిటిపై వికాస్ సింధూరం పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చావని బబ్లూను ఆరా తీయగా.. నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని కుండబద్దలు కొట్టాడు. భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు కొన్ని రోజులుగా చూస్తున్నాం కదానీ వివరించాడు. మీరట్‌లో జరిగిన ఘటన తర్వాత నా భార్యకు పెళ్లి చేస్తే.. ఆమెతోపాటు నేను కూడా వేర్వేరుగానైనా ప్రశాంతంగా బ్రతకొచ్చని అనుకున్నట్టు వివరించాడు.
మీరట్ ఘటన ఏమిటీ?
మాజీ నేవీ అధికారి సౌరభ్, ముస్కాన్‌లు దంపతులు. ఈ నేవీ అధికారి విదేశాల్లో పనికి వెళ్లినప్పుడు ఒంటరిగా ఉన్న ముస్కాన్ సాహిల్ అనే యువకుడికి దగ్గరైంది. ఇద్దరూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. బిడ్డ ఆరేళ్ల బర్త్‌డే కోసం మార్చి 3న లండన్ నుంచి సౌరభ్ ఇంటికి తిరిగి రాగా.. సాహిల్‌తో కలిసి ముస్కాన్ ఆయనను దారుణంగా చంపేశాడు. బాడీని ముక్కలు చేసి డ్రమ్‌లో పడేశారు. ఆ తర్వాత సిమెంట్ నింపేశారు. ఆ డ్రమ్‌లో పట్టని దేహ భాగాలను మరింత చిన్నగా నరికేశారు. ఈ ఘటన దేశమంతా కలకలం రేపాయి.