Elon Musk: పేరు మార్చుకున్న కేకియస్ మాక్సిమస్

బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన పేరుని మార్చుకున్నారు.

Update: 2024-12-31 09:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన పేరుని మార్చుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ లో(official X account) తన పేరును మస్క్‌కు బదులుగా ‘కేకియస్‌ మాక్సిమస్‌’ (Kekius Maximus)గా మార్చుకున్నారు. మ్యాజిక్ స్టిక్ పట్టుకున్న వారియర్ ఫొటోను తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. అయితే, మస్క్ పేరు చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ పేరుకు అర్థం ఏంటా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, కేకియస్‌ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్‌. పలు బ్లాక్‌ చెయిన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది.

మస్క్ వీడియో వైరల్

అంతే,కాకుండా మస్క్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. కొత్త సంవత్సరంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా వెలిగిపోతుందంటూ మస్క్‌ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దాంతోపాటు తన కుమారుడి వీడియోను కూడా పంచుకున్నారు. కాగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ‘నేను ఏమి చేయాలి..?’ అని మస్క్‌ తన కుమారుడు ఎక్స్‌ను ప్రశ్నించారు. దీనికి ‘అమెరికాను కాపాడాలి.. ట్రంప్‌ కు సాయం చేయాలి’ అని బదులిచ్చాడు. టెస్లా ఓనర్‌ సిలికాన్‌ వ్యాలీ పేరుతో ఉన్న అకౌంట్ లో ఈ వీడియో దర్శనమిచ్చింది. మస్క్‌ దీన్ని రీ పోస్ట్‌ చేస్తూ.. ‘2025 అద్భుతంగా ఉండబోతోంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఈ వీడియోలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News