CM Mamata Banerjee: జూనియర్ డాక్టర్లతో చర్చలకు సీఎం మమత రెడీ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Update: 2024-09-12 13:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో బెంగాల్‌లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో వారితో చర్చల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం మరో ప్రకటన విడుదల చేసింది. చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు వాటిలో పాల్గొనేందుకు 30 మంది వైద్యులకు అనుమతి ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్‌ను మమతాబెనర్జీ సర్కారు తిరస్కరించింది.

ఈమేరకు జూనియర్ డాక్టర్లకు బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మనోజ్ పంత్ లేఖ చేశారు. జూనియర్ డాక్టర్లతో చర్చల్లో స్వయంగా పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చర్చల ప్రక్రియను రికార్డు చేసేందుకు అనుమతిస్తామన్నారు. చర్చల్లో 15 మంది జూనియర్ డాక్టర్లే పాల్గొనాలని సూచించారు.


Similar News