కరోనా కేసుల పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

Update: 2023-03-23 16:06 GMT

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల ఆందోళనల నడుమ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వ్యాప్తి దేశంలో ప్రబలంగా ఉన్నప్పటికీ.. ఆసుపత్రిలో చేరడం లేదా మరణాల రేటులో పెరుగుదల లేదని పేర్కొంది. గత మూడు నెలల్లో 344 శాంపిల్స్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ ఉపవేరియంట్లు మహారాష్ట్ర(105), తెలంగాణ(93), కర్ణాటక(57), గుజరాత్(54), ఢిల్లీ(19) ఉన్నాయని వెల్లడించారు.

ఎక్స్‌బీబీ.1.16, ఎక్స్‌బీబీ.1.1.16 వేరియంట్లు ఆందోళన కలిగించేవిగా లేవని గుర్తించినట్లు చెప్పారు. గత వారం రోజుల్లో దేశంలో గణనీయంగా కేసుల సంఖ్య పెరగ్గా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక‌లో ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read...

సొంత జిల్లాలో కాంగ్రెస్ చీఫ్‌కు షాక్ 

Tags:    

Similar News