గుజరాత్ లో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి

గుజరాత్‌ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-10-13 09:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో జసల్‌పుర్‌ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్‌ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా వారిపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ప్రమాద వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ప్రహ్లాద్‌సిన్హ్‌ వాఘేలా వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. 


Similar News