ఢిల్లీ పేలుడు ఘటనపై చురుగ్గా ఎన్‌ఐఏ దర్యాప్తు

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ బయట ఆదివారం ఉదయం భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-10-20 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ బయట ఆదివారం ఉదయం భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో స్కూల్ గోడ కూలిపోయింది. సమీపంలోని కార్ల అద్దాలు పగిలిపోగా, దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ బృందం సేకరిస్తోంది. కాగా ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను బట్టి పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లటి పౌడర్ ను గుర్తించారు. ఆ పౌడర్ ఏమిటన్నది తెలుసుకునే పనిలో పడింది దర్యాప్తు సంస్థ. ఆ ప్రాంతం అంతా షాక్ వేవ్స్ కలిగేలా పేలుళ్లు జరిపినట్టు సమాచారం. మరోవైపు క్లూస్ కోసం పోలీసులు ఇప్పటికే సోషల్ మీడియాను జల్లెడ పడుతుండగా.. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండే అవకాశాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.    


Similar News