NewsClick case: న్యూస్‌క్లిక్‌పై సీబీఐ కేసు..

చైనా నుంచి నిధులను పొంది, ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’ పై సీబీఐ కేసు నమోదు చేసింది.

Update: 2023-10-11 11:35 GMT

న్యూఢిల్లీ : చైనా నుంచి నిధులను పొంది, ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’ పై సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా బుధవారం ఉదయం న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలతో ప్రబీర్‌ పుర్కాయస్థపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇక చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం (యూఏపీఏ) కింద మరో కేసును ఢిల్లీ పోలీసులు ఇంతకుముందే ఆయనపై నమోదు చేశారు. ఆ కేసులో పాటియాలా హౌస్ కోర్టు న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, సంస్థ హెచ్‌.ఆర్‌ హెడ్ అమిత్ చక్రవర్తిలను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. వారు కస్టడీకి వెళ్లిన మరుసటి రోజే సీబీఐ కూడా సోదాలు చేసి, కేసు నమోదు చేయడం గమనార్హం.


Similar News