Nara Chandrababu Naidu : ప్రధాని మోడీతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu), ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో సమావేశం అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu), ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో సమావేశం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు.. ముందుగా అపాయింట్మెంట్ ఉండటంతో ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా.. ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకునేందుకు మరింత ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడం, అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ది, రైల్వే జోన్ శంకుస్థాపన, విభజన హామీలు వంటి అంశాల గురించి కూడా చంద్రబాబు మోడీతో చర్చించారు. కాగా ఆయా సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
ఎవరెవరితో భేటీ కానున్నారు అంటే..
నేటి సాయంత్రం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయి.. ఏపీలో రోడ్ల అభివృద్ధికి తక్షణమే నిధులు వవిడుదల చేయాలని కోరనున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం కేంద్ర పెట్రోలియం మంత్రి హరిదీప్ సింగ్ పురిని, హోంశాఖమంత్రి అమిత్ షాను, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.