Model Chai Wali : ‘ప్లీజ్.. జుట్టు కట్టుకోండి’ లక్నో మోడల్ చాయ్ వాలీ.. వీడియో వైరల్

దేశంలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఉద్యోగాలు వదిలి చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Update: 2024-10-07 10:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఉద్యోగాలు వదిలి చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా టీషాప్‌లు పెట్టుకొడానికి ప్రధాన్యత ఇస్తున్నారు. బిల్‌గేట్స్ మెచ్చిన నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక మోడల్ సైతం టీ షాప్ పెట్టుకుని విజవంతంగా నడిపిస్తోంది. సిమ్రాన్ గుప్తా అనే యువతి ‘మోడల్ చాయ్ వాలీ’ పేరుతో లక్నోలో టీ స్టాల్ పెట్టుకుంది. ఆమె టీ స్టాల్ నడుపుతున్న వీడియోలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. దాదాపు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ ఫుడ్ బ్లాగింగ్ చానల్ ఆమె టీ షాప్ వీడియో పోస్ట్ చేసింది. మోడల్ చాయ్ వాలీ అంటూ టీ స్టాల్లో ఆమె చాయ్ తయారు చేస్తున్న వీడియో పెట్టింది.

అయితే, సిమ్రాన్ గుప్తా 2018లో మిస్ గోరఖ్‌పూర్ టైటిల్ విన్నర్. తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. చాలా యాడ్స్‌లో పనిచేశారని, కరోనా సమయంలో తన మోడలింగ్ వృత్తికి గుడ్ బాయ్ చెప్పినట్టు గతంలో ఆమె ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె కుటుంబం తన సంపాదన పైనే ఆధారపడి ఉందని, ఈ క్రమంలోనే లక్నోలో తన టీ దుకాణాన్ని తెరిచినట్లు తెలిపారు. ఎంబీఏ చాయ్ వాలా తనకు టీ షాప్ పెట్టడానికి ప్రేరణగా నిలిచారని చెప్పుకొచ్చింది. అయితే, ఆమె టీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారండంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. చాయ్ రుచి 2 శాతం ఉంటే.. ఆమె ఓవరాక్టింగ్ 98 శాతం ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చాయ్ చేయండి.. కానీ మీ జుట్టును కట్టుకోండి.. అలా వదిలివేస్తే.. చాయ్‌లో పడుతుందని కొంత మంది సలహాలు ఇస్తున్నారు. నెక్ట్స్ హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరికేసింది.. కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Similar News