నన్ను క్షమించండి : అధికార పార్టీ ఎంపీ

TMC mp apologize

Update: 2024-08-18 12:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బహిరంగ క్షమాపణలు కోరారు. కోల్‌కతా ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ ఘటనలో మృతురాలి వివరాలు బహిర్గతం చేసినందుకు క్షమించమని అడిగారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ నటి రచనా బెనర్జీ. జరిగిన ఘటనను ఖండిస్తూ రచన ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో మృతురాలి పేరును పలుమార్లు ప్రస్తావించడం విమర్శలకు దారి తీసింది. కోల్‌కతా హైకోర్ట్ లాయర్ సచిన్ బసు రచనపై కోర్టులో ఫిర్యాదు చేయగా.. తన తప్పును అంగీకరిస్తూ ఎంపీ బహిరంగ క్షమాపణలు తెలిపారు. 'అలా చేయడం తప్పే, నేను అలా చేసి ఉండకూడదు. మాట్లాడుతున్నపుడు నేను భావోద్వేగానికి గురయ్యాను, అనుకోకుండా ఆమె పేరు వచ్చింది. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను' అంటూ రచనా బెనర్జీ మరొక వీడియో విడుదల చేశారు. 


Similar News