Mamata Banerjee: నాపై విద్వేషపూరితమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).. నిర‌స‌న చేప‌డుతున్న డాక్ట‌ర్ల‌ను బెదిరించిన‌ట్లు బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌లపై స్పందించారు.

Update: 2024-08-29 10:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).. నిర‌స‌న చేప‌డుతున్న డాక్ట‌ర్ల‌ను బెదిరించిన‌ట్లు బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌లపై స్పందించారు. జూనియర్ డాక్టర్లు ఉద్యమం చేస్తున్నవిషయం వాస్తవమే అన్న ఆమె.. వారిని బెదిరిస్తున్నారనే ఆరోపణలను ఆమె ఖండించారు. తనపై విద్వేషపూరితమైన, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. తానేమీ డాక్ట‌ర్ల‌ను బెదిరించ‌లేద‌న్నారు. బుధ‌వారం త‌న ప్ర‌సంగంలో డాక్ట‌ర్ల అంశాన్ని ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. మెడికో విద్యార్థులు కానీ, వాళ్ల ఉద్య‌మం గురించి తానేమీ మాట్లాడ‌లేద‌న్నారు. డాక్ట‌ర్లు చేప‌డుతున్న ఆందోళ‌న‌కు స‌పోర్టు ఇస్తున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. వాళ్లు పోరాటం న్యాయమైంది. ఎన్న‌డూ వాళ్లను బెదిరించ‌లేద‌న్నారు. డాక్ట‌ర్ల‌ను బెదిరించిన‌ట్లు త‌న‌పై కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఆ ఆరోప‌ణ‌లు అవాస్త‌వం అని దీదీ తెలిపారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఆమె ఈ విష‌యాన్ని చెప్పారు. కేంద్రం మద్దతుతో బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోందని ఆరోపించారు. అరాచకం, అన్యాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

దీదీపై బీజేపీ వ్యాఖ్యలు

బుధవారం జరిగిన తృణమూల్ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడారు. 21 రోజులుగా నిరసన దీక్షలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలోని జూనియర్ వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సమ్మె చేస్తున్న వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని ముఖ్యమంత్రి అన్నారు. అయితే, బీజేపీ నాయకులు ఆమె ప్రసంగాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై న్యాయం చేయాలని నిరనస చేపడుతున్న డాక్టర్లను మమతా బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు.


Similar News