మణిపూర్‌లోకి మయన్మార్ మిలిటెంట్లు!

Update: 2024-01-18 19:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో జరిగిన తాజా దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మణిపూర్ సరిహద్దు పట్టణమైన మోరేలో బుధవారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడిన కుకీ మిలింటెంట్లకు మయన్మార్ తీవ్రవాదుల నుంచి సహాయం అంది ఉంటుందని కుల్దీప్ అనుమానం వ్యక్తం చేశారు. కుల్దీప్ వెల్లడించిన వివరాల ప్రకారం, మోరేలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో కమాండో పోస్ట్‌లపై కుకీ మిలిటెంట్లు తెల్లవారు జామున కాల్పులు జరిపారు. మయన్మార్‌లో జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్) తిరుగుబాటుదారులు మోరేలో స్థానిక పీడీఎఫ్ సభ్యులతో కలిసి మణిపూర్‌లోని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేనప్పటికీ, ఇలా జరిగే అవకాశమూ ఉంటుందని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News