నా కెరీర్ ఇప్పటితో ముగిసింది..హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా

బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షా తన కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల తన కెరీర్ ముగిసిపోయిందని, తాను పెద్ద తప్పు చేశానని పేర్కొన్నాడు.

Update: 2024-07-11 14:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షా తన కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల తన కెరీర్ ముగిసిపోయిందని, తాను పెద్ద తప్పు చేశానని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడుపుతున్నానని మిహిర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ‘నేను పెద్ద తప్పు చేశా. దీంతో నా కెరీర్ క్లోజ్ అయింది’ అని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. మిహిర్ షా, అతని ఇద్దరు స్నేహితులు జుహులోని ఒక బార్‌లో మద్యం సేవించారని, అనంతరం డ్రైవర్‌ను తప్పించి తానే కారు నడిపానని ఒప్పుకున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. మరోవైపు మిహిర్ షా డ్రైవర్ రాజ్‌రిషి బిదావత్‌కు మరో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. గురువారం పోలీసు రిమాండ్ ముగియడంతో ఆయనను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ భోసలే ముందు హాజరుపర్చగా..కస్టడీ పొడిగించారు. అలాగే పోలీసులు మిహిర్ షా సమక్షంలో సీన్ రిక్రియేట్ చేశారు.


Similar News