ఒక దేశం, ఒకే ఎన్నికలు ఎక్కడ? : కేంద్రంపై విరుచుకు పడిన మహా వికాస్ అఘాడి

నేడు జమ్మూ కాశ్మీర్, హర్యానాకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-16 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : నేడు జమ్మూ కాశ్మీర్, హర్యానాకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనందుకు భారత ఎన్నికల సంఘాన్ని మహారాష్ట్ర విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. మహా వికాస్ అఘాడి(ఎంవిఎ), దాని మిత్ర పక్షాలు శివసేన (యుబిటి), ఎన్సీపీ(ఎస్పీ) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం తమ అబద్దపు హామీలతో ఉత్తర భారత ప్రజలను మరోసారి మోసం వెర్రివాళ్లను చేయడానికి ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక మహారాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి అబద్దపు వాగ్దానాలు ఇచ్చి మోసం చేయడానికి మరింత సమయం తీసుకొని, సిద్దం అవుతున్నారని అన్నారు. ఎన్నికల ఖర్చు తగ్గించడానికి ఒక దేశం, ఒకే ఎన్నికలు అని మోదీ గొప్పగా చెబుతారు, మరి ఇప్పుడు ఆ నినాదం ఏమైంది అని శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే ప్రశ్నించారు. ఇపుడు మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించక పోవడానికి కారణం భద్రతా బలగాలు పరిమితిగా ఉన్నాయని చెప్పడం నవ్వు తెప్పిస్తోందని ఎద్దేవా చేశారు. సరిపడా భద్రతా బలగాలు లేకపోతే గత మే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలను మాత్రం ఎలా నిర్వహించారు అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో కీలు బొమ్మలగా ఉందని తెలుస్తోందని ఈ సందర్భంగా విపక్షాలు మండిపడ్డాయి. కాగా మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ తో ముగియనుంది.          


Similar News