ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు కీలక సూచనలు..

Update: 2023-03-28 10:42 GMT

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల కావొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ మరిన్ని విజయాలను అందుకోనుందని.. ఇదే క్రమంలో విపక్షాల నుంచి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరిన్ని సానుకూల ఫలితాలతో ప్రతిపక్షాలు మరింతగా లక్ష్యం చేసుకుంటాయని హెచ్చరించినట్లు పేర్కొన్నాయి. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న జరిగే బీఆర్ అంబేద్కర్ జయంతి మధ్య సమయాన్ని సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించాలని ఎంపీలను కోరారు.

మేలో ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్ల పూర్తి కానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరినట్లు కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వల్ తెలిపారు. తల్లి భూమిని రసాయనాల రహితంగా మార్చేందుకు పార్టీ నేతలు పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. చెట్టు, మొక్కలు పెంచి ప్రకృతిని కాలుష్య రహితంగా మార్చాలని కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నాయకులు రాజకీయేతర అంశాలతో పాటు సమాజంపై ప్రభావం చూపే పనులను కూడా చేయాలని కోరినట్లు వెల్లడించారు.

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు భేటి బచావో కార్యక్రమం లింగ సమానతను మెరుగుపరచడంలో పనిచేసిందని ప్రధాని చెప్పారు. కొత్త సాంకేతికను నిపుణుల సహాయంతో ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరినట్లు తెలిపారు. పార్టీకి తక్కువ స్థాయి దాడులతో తప్పవని, అయితే మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకునే అవవాశం ఉందని పేర్కొన్నాయి. కాగా త్రిపురలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నిర్వహించిన తొలి పార్లమెంటరీ సమావేశం ఇదే కావడం గమనార్హం. కాగా, మార్చి 13న ప్రారంభమైన రెండో విడత బడ్జెట్ సమావేశాలు కేంద్రం, ప్రతిపక్షాల నిరసనలతో అంతరాయాల మధ్య కొనసాగుతోంది.

Tags:    

Similar News