Farmers' Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీ- నోయిడా సరిహద్దులో భారీగా ట్రఫిక్ జాం

రైతుల మరోసారి ఆందోళన బాట(Farmers' Protest) పట్టారు. చలో ఢిల్లీ మార్చ్('Delhi Chalo') ని చేప్టటారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Update: 2024-12-02 07:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల మరోసారి ఆందోళన బాట(Farmers' Protest) పట్టారు. చలో ఢిల్లీ మార్చ్('Delhi Chalo') ని చేప్టటారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారతీయ కిసాన్ పరిషత్ (BKP) కనీసం 20 జిల్లాల నుంచి ఇతర రైతు సంఘాలతో కలిసి పాదయాత్ర చేపట్టింది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం.. పాదయాత్ర అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతాబలగాలు, పోలీసులను మోహరించింది. దీంతో, ఢిల్లీ- నోయిడా సరిహద్దుల్లో( Delhi-Noida Borders) భారీగా ట్రాఫిక్ జామ్(Massive Traffic Jam) ఏర్పడింది. చిల్లా(Chilla Border) సరిహద్దులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపోతే, నోయిడా పోలీసులు ఆదివారం కూడా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ఆంక్షలు, దారి మళ్లింపుల గురించి ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని అంతటా భద్రతను పెంచారు. దీంతో, ప్రతి చెక్‌పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సాగు చట్టాలు, పరిహారంపై..

కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. డిసెంబరు 6వ తేదీ నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తారని రైతు సంఘాలు తెలిపాయి. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా అదే రోజు ఆయా అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు. ఢిల్లీ పోలీసు అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్తు సమాచారం అందిందని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.

Tags:    

Similar News