Vadodara: భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవదహనం

గుజరాత్‌లోని వడోదరలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌(Indian Oil Corporation)లో పేలుడు సంభవించింది.

Update: 2024-11-11 17:26 GMT
Vadodara: భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవదహనం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని వడోదరలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌(Indian Oil Corporation)లో పేలుడు సంభవించింది. రిఫైనరీలో స్టోరేజ్ ట్యాంక్ పేలింది. దీంతో చుట్టూ మంటలు అలుముకొని ఒకరు మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంటలను గమనించిన వెంటనే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News