Manoj Jarange : ఎన్నికల్లో పోటీపై మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఆదివారం కీలక ప్రకటన చేశారు.

Update: 2024-10-20 12:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన వెల్లడించారు. అయితే రాష్ట్రంలో మరాఠా ఓటర్లు ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను నిలుపుతానని తెలిపారు. గెలుపు అవకాశాలు ఉన్నచోట్ల మాత్రమే పోటీ చేస్తామని మనోజ్ జరాంగే చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో భావసారూప్య అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా మద్దతుగా నిలుస్తామన్నారు.

మరాఠా ఓటర్లు తక్కువగా ఉండే నియోజకవర్గాల్లోనూ భావసారూప్య అభ్యర్థులకు కుల,మతాలకు అతీతంగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు తెలుపుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన అభ్యర్థులకే తమ మద్దతు లభిస్తుందని మనోజ్ జరాంగే తేల్చి చెప్పారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ సంస్థ తరఫున పోటీ చేయదల్చిన వారంతా నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికపై తాము ఈనెల 29న తుది ప్రకటన చేస్తామన్నారు. 


Similar News