మన్మోహన్ సింగ్ ప్రత్యేకత ఇదే.. మరెవరూ ఆ సాహసం చేయలేదు!(PHOTO)
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణం దేశ ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 92 ఏళ్ల వయసున్న ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS, Delhi) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానిగా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన సన్నిహితులు పంచుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా విమానంలోనే ప్రెస్మీట్ నిర్వహించేవారని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఏ అంశంపై ప్రశ్నలడిగినా అనర్గళంగా మాట్లాడేవారని చర్చించుకుంటున్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన.. దాదాపు 117 సార్లు ప్రెస్మీట్ నిర్వహించారు.