Manipoor: మణిపూర్‌లో సైన్యం తనిఖీలు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో భారీగా ఆయుధాలు పట్టుపడ్డాయి. సమాచారం మేరకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు.

Update: 2024-09-21 17:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో భారీగా ఆయుధాలు పట్టుపడ్డాయి. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ మణిపూర్‌లోని చురచంద్‌పూర్, తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు శనివారం సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మొదటి ఆపరేషన్‌లో చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్‌జింగ్ రిడ్జ్‌లోని అటవీప్రాంతంలో సోదాలు నిర్వహించగా.. రెండు 9 ఎంఎం పిస్టల్స్‌తో, సింగిల్ బ్యారెల్ రైఫిల్, స్థానికంగా తయారు చేసిన రెండు రాకెట్లు, మోడిఫైడ్ లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మోడిఫైడ్ మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, ఇతర మందుగుండు సామగ్రిని పట్టుకున్నారు. అనంతరం తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల శివార్లలోని చాంగ్బీ గ్రామంలో తనిఖీలు చేపట్టాగా రెండు కార్బైన్ మెషిన్ గన్‌లు, రెండు పిస్టల్స్, ఒక సింగిల్ బ్యారెల్ గన్, తొమ్మిది హ్యాండ్ గ్రెనేడ్‌లు సహా ఇతర పరికరాలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న పరికరాలన్నీ తదుపరి విచారణ నిమిత్తం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.  


Similar News