FRAUD : క్లర్క్‌గా రూ.13వేల జీతం.. రూ. 21 కోట్లు కొల్లగొట్టి..

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగం.. నెలకు రూ.13వేల జీతం.. కానీ ప్రియురాలికి ఏకంగా 4బీహెక్‌కే ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు రూ.1.2కోట్ల బీఎండబ్ల్యూ కారు, రూ.1.3కోట్ల ఎస్‌యూవీ, రూ.32లక్షల బైక్ కొనుగోలు చేశాడు.

Update: 2024-12-26 09:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగం.. నెలకు రూ.13వేల జీతం.. కానీ ప్రియురాలికి ఏకంగా 4బీహెక్‌కే ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు రూ.1.2కోట్ల బీఎండబ్ల్యూ కారు, రూ.1.3కోట్ల ఎస్‌యూవీ, రూ.32లక్షల బైక్ కొనుగోలు చేశాడు. కట్ చేస్తే పోలీసుల విచారణలో నిందితుడు రూ.21కోట్లను కొల్లగొట్టినట్లు గుర్తించారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈ షాకింగ్ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్షల్ కుమార్(23) స్థానిక డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తు్న్నాడు. హర్షల్ పాత లెటర్ హెడ్ ఉపయోగించి సంబంధిత శాఖకు చెందిన అకౌంట్ ఈ మెయిల్ మార్పు చేయాలని బ్యాంకుకు రిక్వెస్ట్ పంపాడు. ఆ ఈ మెయిల్‌ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్‌కు లింక్ చేయాలని దరఖాస్తులో కోరాడు. తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ మెయిల్‌లో ఒకే అక్షరాన్ని మార్చి మరో ఈ మెయిల్ క్రియేట్ చేశాడు. తర్వాత అకౌంట్‌కు సంబంధించిన నగదు లావాదేవీల ఓటీపీల సమాచారం తీసుకుని రూ.21కోట్లు కొల్లగొట్టాడు. తర్వాత ఇంటర్నెట్ బ్యాంక్ సదుపాయాన్ని సైతం వినియోగించుకున్నాడు. ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 7 వరకు మొత్తం రూ.21.6కోట్లను13 బ్యాంకు ఖాతాలలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు.

గర్ల్ ఫ్రెండ్‌కు 4 బీహెచ్‌కే ఫ్లాట్

కొల్లగొట్టిన డబ్బుతో హర్షల్ లగ్జరీ కార్లు, తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫ్లాట్ కొన్నాడు. దీంతో పాటు డైమండ్లతో పొదిగిన సన్ గ్లాసెస్‌ను గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు ఈ మోసంలో మరికొంత మంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. డబ్బు ఏయే ఖాతాలకు బదిలీ అయ్యిందో గుర్తించే పనిలో పడ్డారు. ఆర్థిక అవకతవకలను గుర్తించిన క్రీడా శాఖలో పనిచేసే ఓ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News