IndiGo flight: ఇండిగో విమానంలో మహిళకు వేధింపులు

ఇండిగో విమానంలో(IndiGo flight) మహిళలకు వేధింపులు ఎదురయ్యాయి. మహిళ ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-10-11 03:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండిగో విమానంలో(IndiGo flight) మహిళలకు వేధింపులు ఎదురయ్యాయి. మహిళ ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ-చెన్నై(Delhi-Chennai flight) ఇండిగో ఫ్లైట్ లో జరిగింది. విమానంలో నిందితుడు మహిళ వెనకాల కూర్చున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న 43 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విమానం చెన్నైలో దిగిన తర్వాత ఆ మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి విమానాశ్రయ సిబ్బంది ఆమెకు సహాయం చేశారు. దీంతో, మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాజేష్‌శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితునిది రాజస్థాన్‌ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News