Mamata Banerjee: సమస్య పరిష్కరించేందుకు ఇదే చివరి ప్రయత్నం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నిరసనలు తెలుపుతున్న వారి దగ్గరకు వెళ్లి మద్దతు తెలిపారు.

Update: 2024-09-14 09:32 GMT

దిశ,నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నిరసనలు తెలుపుతున్న వారి దగ్గరకు వెళ్లి మద్దతు తెలిపారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder)కు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు తెలుపుతున్నారు. కాగా.. జూనియర్‌ డాక్టర్లకు, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్‌ భవన్‌’ ఎదుట జూనియర్‌ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. కాగా.. దీదీని అక్కడ చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

దీదీ ఏమన్నారంటే?

ఆ తర్వాత దీదీ మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కరించేందుతు ఇదే చివరి ప్రయత్నం అన్నారు. ‘‘గతంలో నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశా. ఆందోళన చేయడం మీ హక్కు. కానీ సమస్యను పరిష్కరించేందుకు చాలా రోజులుగా చర్చల కోసం ఎదురుచూస్తున్నా. సెక్యురిటీని కాదని మీ ఆందోళనలకు సలాం చేసేందుకు వచ్చా. సీఎంగా కాది.. మీ దీదీగా వచ్చా. నాకు పదవి ముఖ్యం కాదు. నేనొక్కదాన్నే ప్రభుత్వాన్ని నడపట్లేదు. బాధితురాలికి న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. వానను లెక్కచేయకుండా ఆందోళన చేస్తూంటే నేను కలత చెందుతున్నా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. మీ డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తా. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీ రద్దు చేస్తున్నా. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సీబీఐని కోరుతున్నా. నామీద నమ్మకం ఉంటే చర్చలకు వచ్చి.. వెంటనే విధుల్లో చేరండి. మీపై ఎలాంటి చర్యలు తీసుకోం ’’ అని మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లను కోరారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగాల్సిందే అని వారు పట్టుబట్టారు. అప్పటివరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదన్నారు. దీంతో దీదీ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.


Similar News