Mamata Banerjee: ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
దేశం అంతటా బీజేపీ హవా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశం అంతటా బీజేపీ హవా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొదటి నంచి బీజేపీ బద్ధ వ్యతిరేకి అయిన సీఎం మమతా బెనర్జీ అందుకు తగినట్లుగానే రాష్ట్రం విస్తృతంగా పర్యటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లలో విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చింది. ఈ వ్యా్ఖ్యలపై బీజేపీ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. మమతా మాట్లో ఏ మాత్రం నిజం లేదంటూ కొట్టి పడేసింది. బీజేపీ ఎంపీలు అమ్ముడుపోయే వ్యక్తుల కాదని, అలాంటి క్యాండిడేట్లు తృణమూల్ కాంగ్రెస్‌లోనే ఉన్నారంటూ బీజేపీ నాయకులు కౌంటర్ అటాక్ చేశారు.