హెలికాప్టర్ ఎక్కుతుండగా కిండపడ్డ మమతా బెనర్జీ: స్వల్ప గాయాలు

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడ్డారు.

Update: 2024-04-27 09:45 GMT
హెలికాప్టర్ ఎక్కుతుండగా కిండపడ్డ మమతా బెనర్జీ: స్వల్ప గాయాలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది ఆమెకు సహాయం అందించారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు మమతా అసన్ సోల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్రథమ చికిత్స అనంతరం తిరిగి మమతా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించినట్టు తెలుస్తోంది. కాగా, గత నెల 14న కూడా మమతా బెనర్జీ కోల్ కతాలోని తన నివాసంలో జారిపడగా తలకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. గతేడాది జూన్‌లోనూ ప్రతికూల వాతావరణం కారణంగా సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడంతో మమతా కాలికి గాయమైంది. అయితే ప్రస్తుతం ఎన్నికల వేళ మమతా బెనర్జీకి ప్రమాదం తప్పడంతో టీఎంసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News