Niger: నైగర్‌లో మసీదుపై ఉగ్రవాదుల దాడి.. 44 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మసీదుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 44 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు.

Update: 2025-03-22 16:07 GMT
Niger: నైగర్‌లో మసీదుపై ఉగ్రవాదుల దాడి.. 44 మంది మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌ (Niger) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మసీదుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 44 మంది మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. మాలి, బుర్కినా ఫాసో సరిహద్దుకు సమీపంలోని కోకోరో గ్రామీణ ప్రాంతంలోని ఫాంబిటా (Fambita) గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని తెలిపింది. రంజాన్ ప్రార్థనల టైంలో ప్రజలు గుమిగూడిన నేపథ్యంలో దాడికి పాల్పడినట్టు పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ గ్రేట్ సహారా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఈఐజీఎస్ ఈ ఘటనకు కారణమని ఆరోపించింది. ముస్లింలు ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్న టైంలో భారీగా ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు సంబంధిత మసీదును చుట్టుముట్టి దాడులకు పాల్పడ్డారని తెలిపింది. అంతేగాక దాడి అనంతరం ఒక మార్కెట్‌కు సైతం నిప్పుపెట్టి వెళ్లారని తెలిపింది.

ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని తెలిపింది. ఈ చర్యను అత్యంత క్రూరమైందనిగా అభివర్ణించింది. మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. కాగా, నైగర్ దాని పొరుగు దేశాలైన బుర్కినా ఫాసో, మాలిలతో పాటు, ఒక దశాబ్దానికి పైగా జిహాదీ గ్రూపులు చేస్తున్న తిరుగుబాటుతో పోరాడుతోంది. ఆ సంస్థల్లో కొన్ని అల్-ఖైదా ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో అనుబంధంగా ఉన్నాయి. అంతకుముందు కూడా దేశంలో అనేక దాడులు జరిగాయి. పట్టణాలు, గ్రామాలు, సైనిక పోస్టులు, కాన్వాయ్‌లపై దాడి చేయగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News