బడ్జెట్ పూర్తి అబద్దాలే : Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ ఐసీ, జాతీయ బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ ఐసీ, జాతీయ బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బులను తమ నేత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని విమర్శించారు. పుర్బ బర్దామాన్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో గురువారం ఆమె మాట్లాడారు. కేంద్ర తీసుకొచ్చిన బడ్జెట్‌తో స్టాక్ మార్కెట్ పతనమైందని అన్నారు. కొందరికి కోట్ల రూపాయాలు పంపింగ్ చేయాలని ఫోన్ కాల్స్ వచ్చాయని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా అబద్దాలతో నిండి ఉందని విమర్శించారు. 2024 ఎన్నికలపై దృష్టి పెట్టిందని అన్నారు.