ఇది క్రూరత్వం.. Anand Mahindra ఎమోషనల్ ట్వీట్

ఆప్ఘానిస్థాన్‌లో మహిళలను యూనివర్సిటీ చదువులకు దూరం చేస్తూ తాలిబన్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే..

Update: 2022-12-23 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్ఘానిస్థాన్‌లో మహిళలను యూనివర్సిటీ చదువులకు దూరం చేస్తూ తాలిబన్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీని గురించి తెలుసుకుని యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజాగా, ఈ విషయంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ''నా జీవితమంతా ఇదే నమ్ముతూ వచ్చాను. కానీ ఇవాళ ఆఫ్ఘాన్ మహిళలు యూనివర్సిటీల్లో చదవడం తాలిబన్లు నిషేదం విధించారన్న వార్త నా మనస్సును ఎంతగానో కలిచివేసింది. యుద్ధం, హింసతో మానవహననానికి పాల్పడటం రక్తం ఏరులై పారించడం భయంగొలిపే హత్యలే. ఈ నిషేధం కూడా ఓ హత్యే. సుధీర్ఘకాలం పాటు సాగే క్రూరమౌన మారణకాండ. సమాజానికి ఇచ్చే నా ప్రధాన విధానం మహిళల విద్యకు మద్దతు ఇవ్వడం'' అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు.

Tags:    

Similar News