రెండు రోజుల్లో కుట్రదారులను పట్టుకుంటాం: డిప్యూటీ సీఎం

ఎన్సీపీ ఎమ్మెల్యే సిద్దికీని నిన్న (శనివారం) గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Update: 2024-10-13 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్సీపీ ఎమ్మెల్యే సిద్దికీని నిన్న (శనివారం) గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. రెండు రోజుల్లో హత్య కుట్రదారులను గుర్తిస్తాం. దీనిపై సీఎం, హోం మినిస్టర్ కూడా స్పెషల్‌గా ఫోకస్ పెట్టారని చెప్పారు. సిద్దికి మరణం చాలా బాధాకరణమని, సీనియర్ లీడర్‌ని కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటని అన్నారు. ‘‘పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలుగా వెతుకుతున్నారు. రెండు రోజుల్లో హత్య కుట్రదారులను గుర్తిస్తాం. దీనిపై సీఎం, హోం మినిస్టర్ కూడా సీరియస్‌గా ఉన్నారు. అతి త్వరలో ఈ కేసును ఛేదిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం సిద్దికీ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఆయన ఆఖరి చూపు కోసం అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇక ఈ రోజు (ఆదివారం) రాత్రి 8 గంటలకు అధికారిక లాంఛనాలతో సిద్దికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ముంబైలోని బడా కబరిస్తాన్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా.. సిద్దికీకి సన్నిహితంగా మెలిగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను భారీ ఎత్తున పెంచారు. 


Similar News