Maharashtra: గోమాంసం తరలిస్తున్నారని దాడి.. వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది.

Update: 2023-06-26 11:52 GMT

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో గోసంరక్షకుల బృందం శనివారం రాత్రి ముంబైలోని కుర్లాకు చెందిన 32 ఏళ్ల అఫాన్ అన్సారీ, అతని సహాయకుడు నాసిర్ షేక్‌పై ఇనుప రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే కారు ధ్వంసమై ఉందని, గాయపడిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు హత్య, అల్లర్లకు సంబంధించిన అభియోగాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన కారు నుంచి 450 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అది గో మాంసమా కాదా అన్నది తేలుతుందని పోలీసులు చెప్పారు.


Similar News