DY Chandrachud: ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రతరమైంది. కాగా.. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గురించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రతరమైంది. కాగా.. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గురించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ‘నేను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశా. సాధారణంగా ఉదయం 4 నుంచి 4.15 మధ్య వాకింగ్‌కు వెళ్తాను. ప్రస్తుతం గాలి నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే మంచిదని నా వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లోనే ఉండటం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు’ అని సీజేఐ తెలిపారు.
తగ్గిపోయిన గాలి నాణ్యత
ఇకపోతే, శుక్రవారం ఉదయం 8 గంటలకి ఢిల్లీలో గాలి నాణ్యత 283 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) తెలిపింది. ఆనంద్ విహార్‌లో 218, పంజాబీ బాగ్‌లో 245, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 276, జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 288గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. గత రెండు రోజులుగా రాజధానిలో కాలుష్యం పెరిగిపోయింది. ఢిల్లీలోని గాలి నాణ్యత 'వెరీ పూర్' కేటగిరీలోకి ప్రవేశించడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP-2) రెండో దశ కొనసాగిస్తోంది. అక్టోబర్ 22 ఉదయం 8 గంటల నుండి ఢిల్లీలో గ్రాప్ 2 అమలవుతోంది.