Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు అరెస్టు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఫోకస్ పెట్టింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఫోకస్ పెట్టింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. పంజాబ్ సహా పలు రాష్ట్రాల నుంచి వారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ బాబా సిద్ధిఖీ హత్య కేసు గురించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని విచారించగా, కాల్పులు జరిపిన వ్యక్తికి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తెలిసింది. హత్యకు ముందు నిందితులు అన్మోల్ బిష్ణోయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇకపోతే, సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటివరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ 11 మందిని అరెస్టు చేసింది.
అన్మోల్ బిష్ణోయ్ పై రూ.10 లక్షల రివార్డు
అంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా చర్యలకు పూనుకుంది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. పోలీసుల నివేదిక ప్రకారం.. అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. అన్మోల్ బిష్ణోయ్ తన లొకేషన్‌లను మారుస్తూ ఉంటాడు. గతేడాది కెన్యా, ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడు. అన్మోల్ బిష్ణోయ్‌పై 18 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. జోధ్‌పూర్ జైలులో శిక్షను అనుభవించాడు. అన్మోల్ 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు.