మీ భర్తలతో మద్యం ఈ విధంగా మాన్పించండి.. మహిళలకు రాష్ట్ర మంత్రి టిప్స్

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు.

Update: 2024-06-29 15:46 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. దీని కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచి, చెడు.. పరిస్థితులు ఎలాంటివి అయినా మద్యం సేవించేందుకు ఇష్టపడుతున్నారు. ఇంట్లో మగాళ్లను మద్యానికి దూరంగా ఉంచేందుకు ఇంట్లో వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తు్న్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. అలాగే.. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ దీనిపై సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మంత్రి మహిళకు టిప్స్ ఇచ్చారు. ఈ విధంగా చేస్తే మీ భర్తలు మందుకు దూరంగా ఉంటారు అంటూ సూచనలు ఇచ్చారు. అయితే ఆ మంత్రి ఎవరూ.. ఎలాంటి సలహాలు ఇచ్చారు అనేది తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్రాష్ట్రంలో మద్యపానం, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు అక్కడ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా ప్రజలకు ఓ సూచన ఇచ్చారు. ‘చాలా మంది ఇళ్లల్లో మగాళ్లు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. వారు మద్యం మానేయాలి అంటే ముందుగా మీరు ఒక పని చెయ్యాలి. బయట తాగి ఇంటికి రావొద్దు.. మీకు మద్యం సేవించాలి అంటే ఇంటికి తెచ్చుకుని తాగిండని చెప్పండి. ఆ విధంగా చేస్తే.. కుటుంబసభ్యలు, భార్య, పిల్లల ముందు మందు తాగేందుకు వారిలో మొదట పశ్చాత్తాపం మొదలవుతుంది. కాలక్రమేనా మందు తగ్గించి.. తర్వాత పూర్తిగా దానికి దూరం అవుతారు’ అంటూ చెప్పుకొచ్చారు. మంత్రి కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Similar News