బీజేపీకి షాక్ ఇచ్చిన కేకే సర్వే సంస్థ అధినేత

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితమైన సర్వే ఫలితాలను అంచనా వేసిన కేకే సర్వే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం కేకే సర్వే పై అందరి దృష్టి పడింది.

Update: 2024-09-19 12:01 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితమైన సర్వే ఫలితాలను అంచనా వేసిన కేకే సర్వే (KK survey) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం కేకే సర్వే పై అందరి దృష్టి పడింది. దీంతో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేకే సర్వే (KK survey) సంస్థ సర్వేలు నిర్వహిస్తోంది. కాగా ఈ రాష్ట్రాల ఫలితాలపై కేకే ఆ సంస్థ అధినేత కొండేటి కిరణ్ (Kondeti Kiran) ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(bjp) ఘోర పరాజయం చెందనుందని.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP) ఒక ‘టైటానిక్ షిప్‌’లా తయారైందని చెప్పుకొచ్చారు. కేవలం హర్యానా రాష్ట్రంలోనే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాజయాలతో చేదు అనుభవాలు తప్పవని కేకే సంస్థ ఎండీ కొండేటి కిరణ్ (Kondeti Kiran) హెచ్చరించారు. ఇటీవల పరిస్థితులు, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో న్యూట్రల్ ఓటు బ్యాంకు తీవ్రంగా ప్రభావితమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా (Haryana)లో పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. ప్రతి మూడింటిలో రెండు చోట్ల ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.


Similar News