ఉమేష్ పాల్ హత్య నిందితుడు ఎన్‌కౌంటర్..

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా సంచలనం రేపిన హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అర్బాజ్ ఎన్‌కౌంటర్లో మరణించారు.

Update: 2023-02-27 11:58 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తాజాగా సంచలనం రేపిన హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అర్బాజ్ ఎన్‌కౌంటర్లో మరణించారు. ప్రయాగ్ రాజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో కానిస్టేబుల్, ఇన్స్ పెక్టర్ కు కూడా గాయాలైనట్లు అధికారులు చెప్పారు. గత వారం 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ ప్రయాగ్‌రాజ్‌లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ వెనుక సీటు నుంచి దిగుతుండగా కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News