డ్యాన్స్ చేసిన మహిళా న్యాయమూర్తి

చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కళలను ఎప్పటికీ మర్చిపోరనడానికి ఇదే నిదర్శనం.

Update: 2023-11-04 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కళలను ఎప్పటికీ మర్చిపోరనడానికి ఇదే నిదర్శనం. తను నేర్చుకున్న భరతనాట్యాన్ని వేదికపై ప్రదర్శించించి అందరి మన్ననాలు పొందారు కేరళకు చెందిన ఓ న్యాయమూర్తి. తిరువనంతపురంలోని నిశాగంధి ఆడిటోరియంలో కేరళీయం వేడుకలు నిర్వహించారు. దీనికి రాయకీయ నాయకులతోపాటు కేరళ రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో కొల్లాం ఇండస్ట్రీయల్ ట్రైబ్యునల్ ఈఎస్ఐ కోర్డు న్యాయమూర్తి జస్టిస్ సునీతా విమల్ భరతనాట్యం చేసి సభికులను మైమరిపించారు. ప్రదర్శనకు ముందు ఆమె జడ్జి అనే విషయం ఎవరికి తెలియదు. నాట్యం అనంతరం జస్టిస్ సునీతా విమల్ మాట్లాడుతూ.. కళలకు పదవులు అడ్డురావన్నారు. తాను న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినా చిన్ననాటి నుంచి మక్కువతో నేర్చుకున్న భరతనాట్యాన్ని వదులుకోదని చెప్పారు. 


Similar News