శివరాజ్ సింగ్, వసుంధరా రాజే కొత్త పార్టీలు పెట్టేస్తారు..కండీషన్స్ అప్లై : కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్), వసుంధరా రాజే (రాజస్థాన్)లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-18 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్), వసుంధరా రాజే (రాజస్థాన్)లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు, మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 45లకు భయపడి శివరాజ్, వసుంధర లాంటి సీనియర్ నేతలంతా బీజేపీలో కంటిన్యూ అవుతున్నారని విమర్శించారు. ఈడీని ఆపేసి, సెక్షన్ 45ని రద్దు చేస్తే.. ప్రధాని మోడీ వద్ద గుర్తింపునకు నోచుకోని శివరాజ్‌సింగ్‌, వసుంధరా రాజే వంటి నేతలంతా సొంత పార్టీలను పెట్టుకుంటారని కామెంట్ చేశారు. బీజేపీ నుంచి బయటికి రావాలని భావించే నేతలకు ఈడీ పెద్ద అడ్డుగోడలా నిలబడి ఉందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో భోజన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. భోజనాల అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో కేజ్రీవాల్ పైవ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీతో చేతులు కలిపి ఉంటే, ఆయన ఇప్పుడు జైలులో ఉండేవారు కాదన్నారు. బీజేపీ దురాగతాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నందుకు హేమంత్ సోరెన్‌ను యావత్ దేశం కొనియాడుతోందని ఆయన చెప్పారు. కష్టాలు ఎదురైనా సత్యమార్గంలోనే పయనిస్తున్న హేమంత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. హేమంత్ సోరెన్ కుటుంబానికి అండగా ఉంటామని కేజ్రీవాల్ తెలిపారు.

Tags:    

Similar News