Kejriwal: కేజ్రీవాల్‌కు నో రిలీఫ్..జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ గురువారంతో ముగిసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ గురువారంతో ముగిసింది. దీంతో ఆయనను తిహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని అధికారులు కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా, మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన తిహార్ జైలులో ఉండగానే జూన్ 26న సీబీఐ అదుపులోకి తీసుకుంది. అయితే మార్చి 12న కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన సీబీఐ కేసులో జైలులోనే ఉన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని జూలై 17న రిజర్వ్ చేసింది. దీనిపై జూలై 29న విచారణ చేపడతామని తెలిపింది.