Kazakhstan Plane : కజకిస్తాన్ విమాన ప్రమాదం.. మృత్యుంజయులు 25మంది!

42మంది దుర్మరణానికి కారణమైన కజకిస్తాన్ విమాన ప్రమాదం(Kazakhstan Plane Crash)లో అనూహ్యంగా 25మంది మృత్యుంజయులు(Save)గా నిలవడం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-12-26 10:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : 42మంది దుర్మరణానికి కారణమైన కజకిస్తాన్ విమాన ప్రమాదం(Kazakhstan Plane Crash)లో అనూహ్యంగా 25మంది మృత్యుంజయులు(Save)గా నిలవడం ఆసక్తికరంగా మారింది. పక్షి ఢీకొనడంతో పైలట్ ఎమర్జన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం క్రాష్ అయింది. విమానం భూమికి తాకగానే పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇలాంటి విమాన క్రాష్ ఘటనలో ఒక్కరు బతికినా అదృష్టమే. అలాంటిది కజికిస్తాన్ లోని ఆక్తావు వద్ధ అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ చెందిన జే2 8243విమాన ప్రమాదంలో ఏకంగా 25మంది మృత్యువును జయించారు. ఈ ఘోర ప్రమాద సమయంలో విమానంలో 62మంది ప్రయాణికలు, 5గురు సిబ్బంది మొత్తం 67మంది ఉండగా, వారిలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటికి తీసుకువచ్చారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిలో 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాలుడు సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

మరోవైపు ఈ విమానం పక్షి ఢీ కొనడంతో కూలిపోలేదని, రష్యా ఉక్రెయితన్ మధ్య జరుగుతున్న యుద్ధ దాడుల్లో కివ్ కు చెందిన డ్రోన్ గా భావించి సైనిక బలగాలు ఈ విమానాన్ని కూల్చివేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇందుకు విమానంపై ఉన్న రంధ్రాలే నిదర్శమని మీడియా సంస్థలు వెలువరించిన కథనాలు ఆసక్తిరేపుతున్నాయి.

Tags:    

Similar News