ప్రధాని మోడీ హోటల్ బిల్లు మేమే చెల్లిస్తాం : కాంగ్రెస్ సర్కారు

దిశ, నేషనల్ బ్యూరో : మైసూరులో గతేడాది ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బస చేసిన రాడిసన్‌ బ్లూ హోటల్‌‌కు సంబంధించిన పెండింగ్ బిల్లును తామే కట్టేస్తామని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-05-27 18:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మైసూరులో గతేడాది ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బస చేసిన రాడిసన్‌ బ్లూ హోటల్‌‌కు సంబంధించిన పెండింగ్ బిల్లును తామే కట్టేస్తామని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ హోటల్‌కు బకాయి ఉన్న బిల్లులో రూ.80 లక్షలను తాము చెల్లిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయమని, అందులో భాగంగానే తాము బిల్లు కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ‘ప్రాజెక్టు టైగర్‌’ మొదలై 50 ఏళ్లయిన సందర్భంగా గతేడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో మైసూరులో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని మోడీ స్థానికంగా ఉన్న రాడిసన్‌ బ్లూ హోటల్‌లో బస చేశారు. ఆనాటి నుంచి పెండింగులో ఉన్న రూ.80 లక్షల బిల్లును చెల్లించకపోవడంపై న్యాయపరమైన చర్యలకు హోటల్ యాజమాన్యం రెడీ అయింది. దీనిపై స్పందించిన కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు హోటల్ బిల్లును చెల్లించేందుకు ముందుకు వచ్చింది.

Read More..

జూన్ 1న ఇండియా కూటమి భేటీకి రాలేను : మమతా బెనర్జీ 

Tags:    

Similar News