విద్యా సంస్థలు తెరవండి: కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

Update: 2022-02-10 13:13 GMT

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరవాలని ఆదేశించింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మతాన్ని ప్రతిబింబించేలా వస్త్రాధారణ ధరించకూడదని విద్యార్థులను కోరింది. వచ్చే సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా, బుధవారం ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థినుల తరుఫున న్యాయవాది సంజయ్ హెగ్డే మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ నుంచి హిజాబ్ ధరించిన వారిపై వివక్ష చూపించినట్లు తెలిపారు. స్కూల్ యూనిఫామ్ పై ఎలాంటి నిబంధనలు లేకపోయినా రాష్ట్ర విద్యా చట్టం ప్రకారం యూనిఫాం పాఠశాలకు సంబంధించిన అంశమని అన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఎన్వీ రమణ అధ్వర్యంలోని బెంచ్ ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేమని తెలిపింది. ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటు చర్య అని పేర్కొంది. హైకోర్టు నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Tags:    

Similar News