Plane Crash: 179కి చేరిన మృతుల సంఖ్య.. విమాన ప్రమాదానికి కారణమిదే!

దక్షిణ కొరియా(South Korea)లోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Mueang International Airport)లో విమానం ల్యాండ్‌ అవుతూ అదుపుతప్పిన విషయం తెలిసిందే.

Update: 2024-12-29 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea)లోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Mueang International Airport)లో విమానం ల్యాండ్‌ అవుతూ అదుపుతప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 179 మంది మృతిచెందారు. ఇందులో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌(Bangkok) నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం ల్యాండ్‌ అవుతూ అదుపుతప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News