ఖలిస్థానీలపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు..

కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీలు నిర్వహించిన నిరసనలపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-10 14:58 GMT

న్యూఢిల్లీ : కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీలు నిర్వహించిన నిరసనలపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఖలిస్థానీల ఆధ్వర్యంలో సాగిన నిరసన కార్యక్రమాలు.. ఓ మత వర్గానికి కానీ, యావత్ కెనడాకు కానీ ప్రాతినిధ్యం వహించవని ఆయన స్పష్టం చేశారు. ‘‘కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ, శాంతియుత నిరసన స్వేచ్ఛ హక్కులను కాపాడుతుంది. అదే సమయంలో హింసను నిరోధించేందుకు, విద్వేషానికి వ్యతిరేకంగా చర్యలు కూడా తీసుకుంటుంది’’ అని ట్రూడో తేల్చి చెప్పారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత ప్రధాని మోడీతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. కెనడాలో ఖలిస్థానీల నిరసనలపై ఈసందర్భంగా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది.


Similar News